![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వేళ పాత కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టిన వేళ అన్నట్టుగా నామినేషన్లు సాగాయి. ఒక్కొక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తమ స్ట్రాటజీని ప్లే చేశారు. వారిలో ముఖ్యంగా భరణి, దివ్య, తనూజలని ఎక్కువగా టార్గెట్ చేశారని నిన్నటి ఎపిసోడ్ లో తెలిసింది.
హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ లో అయేషా షార్ప్ లా కన్పిస్తుంది. ఎందుకంటే సంజన, తనూజలని సుమన్ శెట్టి నామినేషన్ చేయగా అయేషా మాత్రం తనూజని నామినేట్ చేసింది. మీ ఇన్‌ఫ్లుయెన్స్, మీ ఫేవరిజం వల్ల ఇక్కడ మిగిలిన అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందనేది నా పాయింట్.. ఉదాహరణకు చెప్పాలంటే నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది.. ఆల్రెడీ స్టార్ మాలో చాలా మంచి సీరియల్స్ ఉన్నాయి.. ఇక్కడ అది అవసరం లేదంటూ అయేషా చెప్పింది. దీనికి ప్రతి దానికి భరణి సర్ వచ్చి నన్ను సపోర్ట్ చేశారా.. నేను ఏం సింగిల్‌గా గేమ్ ఆడలేదా అని తనూజ అడిగింది. నీకు ఏ ప్రాబ్లమ్ అయినా నాన్న ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని ఏడవలేదా నువ్వు ఇక్కడ అని సూటిగా ప్రశ్నించింది అయేషా. అఫ్‌కోర్స్ ఎవరికి వాళ్లు ఇక్కడ ఫేవరెట్ ఉన్నారు.. ఎవరికి వాళ్లు సపోర్ట్ చేసుకోవడానికి ఉన్నారని తనూజ ఒప్పుకుంది. అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావా అని మళ్లీ కొశ్చన్ చేసింది అయేషా.
మేము మొదటి రోజు నుండి నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి ఆ బాండ్ ఉందంటూ తనూజ అంటుంది. ఆ అదే నేను చెప్తున్నా మీరు క్లోజ్‌గా చాలా ఉన్నారని చెప్తున్నానంటూ అయేషా అంది. అలానే మీరు ఈ హౌస్‌లో ఎప్పుడూ మీరు రెండు పనులు చేస్తారు.. ఒకటి అరుస్తారు.. ఎందుకు అరుస్తారో తెలీదు.. లేదంటే ఏడుస్తారు.. ఇప్పుడు కట్ చేస్తే మీరు ఈ నామినేషన్ అయిపోయాక భరణి గారి దగ్గరికెళ్లి నాన్న నా వల్ల నీ ఆట పోయిందా నాన్న అంటూ ఏడుస్తావ్.. చేసేది అదే అంటూ అయేషా అంది. మీరు ఒరిజినల్ నాన్న కూతురా? కాదు కదా.. నిజానికి ఈ సీజన్ ఎలా అయిందంటే ఇక్కడ ఒక నాన్నో-బాయ్‌ఫ్రెండో ఉంటే ఓకే ఫినాలేకి వచ్చేద్దామనేలా ఉందని అయేషా అంది.
![]() |
![]() |